ఆంధ్రప్రదేశ్ లో ప్రీ ప్రైమరీ విద్య అవసరం లేదని ఆరోపిస్తున్న ఉపాధ్యాయులు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేఖించే అధికారం ఉపాధ్యాయులకు లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సీబీఎస్ఈ, ఇంగ్షీషు లో భోధన, డిజిటల్ క్లాస్ రూమ్‌లు వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు.