ఇటీవలే సంగీత దర్శకుడు ఇళయరాజా రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసారు. తాజాగా ఈరోజు ఇళయరాజా ఉపరాష్ట్రపతి నివాస్‌లో ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుని కలిశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన అధికారిక నివాసానికి ఇళయరాజాను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు ప్రముఖులు పలు అంశాలపై చర్చించారు.