తమలపాకుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆకలి అనిపించనప్పుడు, నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. పొట్ట ఉబ్బరంగా ఉంటే తమలపాకులు తింటే మంచిది. తలనొప్పి, మైగ్రైన్ కి తమలపాకులు దివ్య ఔషధంలా ఉపయోగపడతాయి. తమలపాకులను రోజూ తీసుకుంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరిచేందుకు తమలపాకులు బాగా పనిచేస్తాయి.