మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం నలుగురికి ఉరి అమలు చేసింది. గత సంవత్సరం ఆంగ్ సాన్ సూకీ నుంచి అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకున్న మయన్మార్ సైన్యం 50 ఏళ్ల తర్వాత దేశంలో ఉరిశిక్ష అమలు చేసింది. తాజాగా ఓ రాజకీయ నేత సహా నలుగురికి మరణశిక్ష అమలు చేసింది. ఆంగ్ సూన్ సూకీ వర్గానికి చెందిన మాజీ శాసనసభ్యుడు పోయో జియో థావ్ తో పాటు మరో ముగ్గురు ప్రజాస్వామ్య ఉద్యమకారులను కూడా సైన్యం ఉరికొయ్యకు వేలాడదీసింది. వీరు హింసాత్మక కార్యకలాపాలు, ఉగ్రవాదానికి పాల్పడినట్టు మయన్మార్ మిలిటరీ పాలకులు ఆరోపించారు. గత జూన్ లో జియో థావ్ తో పాటు హలా మియా, ఆంగ్ తురా జా, కో జిమ్మి అనే ప్రజాస్వామ్య ఉద్యమకారులకు సైన్యం మరణశిక్ష ఖరారు చేసింది.