ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో సురేష్ బాబులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం మహా కుంభాభిషేకం , ధ్వజస్తంభం ప్రతిష్ట గురించి చర్చించునున్నట్లు పేర్కొన్నారు. ఆలయ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు.