ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదించాలని కోరుతూ వారు చేపట్టిన నిరసన దీక్ష09 మంగళవారం నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనైనా అమలు చేయాలని విజ్ఞప్తి చేసుకున్నారు. నాయకులు గండికోట వెంకటేష్, కోళ్ల ఫారం రమణ, తదితరులు పాల్గొన్నారు.