మారుతున్న విద్యా విధానం కారణంగా ఆన్లైన్ క్లాసులు, ఎక్కువగా మొబైల్ లో గడపడంతో పాటు గంటల తరబడి కంప్యూటర్లు, ల్యాప్లాప్ల ముందు కూర్చోవడం వల్ల కంటి సమస్యలు అధికమవుతున్నాయి. దీంతో కంటి చూపును మెరుగు పర్చుకునేందుకు ఆకు కూరలు ఎక్కువగా తినాలని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ తాగడంతో పాటు డ్రై ఫ్రూట్స్, పొద్దు తిరుగుడు విత్తనాలను తీసుకోవడం వలన కంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు.