జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) సొమ్ముకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. శ్రీనగర్ కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. ఫరూక్ అబ్దుల్లా 2001 నుండి 2012 వరకు జేకేసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం జరిగింది ఈడీ ఆరోపిస్తోంది.