మంగళగిరి: నగరంలో మలేరియా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్ర క్షయనివారణ అధికారి డాక్టర్ పి రమేష్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఆరవ సచివాలయం పరిధిలో మలేరియా శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సందర్భంలో ఆయన ఆకస్మిక తనిఖీ చేసి, ఆ సచివాలయ పరిధిలో ప్రజలను కలిసి తమ సిబ్బంది పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులని అప్రమత్తంగా ఉండాలన్నారు.