ప్లాస్టిక్ కవర్లను తెనాలి లో నిషేథించినందున పట్టణంలో ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వాడకానికి దూరంగా ఉండాలని మునిసిపల్ కమిషనర్ జస్వంత్ రావు తెలియచేశారు.
ప్లాస్టిక్ ను తయారుచేసినా, ఉపయోగించిన షాపులకు అపరాధ రుసుము విధించడంతో పాటు, ఆయా షాపులను సీజ్ చేయటం జరుగుతుందని కమిషనర్ అన్నారు, మంగళవారం పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడే మార్కెట్ కూడలి గంగానమ్మపేట లోని షాపులను మునిసిపల్ అధికారులు తనిఖీ చేశారు.