కర్నూలు: తెలుగు చలనచిత్ర కథానాయకుడు, టిడిపి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కర్నూలు నగరంలో మంగళవారం టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి జయనాగేశ్వర రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాగేంద్ర నాయకులతో కలిసి శాలువా, పూలమాలలతో బాలకృష్ణను ఘనంగా సన్మానించారు.