శ్రీకాళహస్తిలో ఆడి కృత్తిక వార్షికోత్సవాల్లో భాగంగా నేడు వసంతోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను వసంత మండపంలో తీసుకొచ్చి తిరుమంజన గోపురం నుంచి ఆలయానికి తీసుకెళ్లనున్నారు. ఈ సందర్భంగా తిరుమంజన గోపురం మెట్లను పసుపు కుంకుమలతో పారిశుద్ధ్య విభాగం మహిళలు సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే వసంత మండపం పరిసరాలను శుభ్రం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa