వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్లు, వాహన రికార్డులు కలిగి ఉండాలని ఎస్ఐ గోపీనాథ రెడ్డి అన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని పూలఅంగళ్ల సర్కిల్, పాత ఆర్టీసీ బస్టాండు సర్కిల్, తదితర ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్లు, వాహన రికార్డులు లేనివారిని హెచ్చరించి జరిమానాలు విధించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు లైసెన్స్లు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలన్నారు. త్రిబుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలకు గురిఅయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. లైసెన్స్లు, వాహన రికార్డులు లేకకున్నా వాహనాలను నడిపినా భారీ జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.