బీహార్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అతలాకుతలమవుతోంది. 8 జిల్లాల్లో సోమవారం సాయంత్రం నుంచి 48 గంటల్లో పిడుగుపాటుకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. గడచిన 24 గంటల్లో బిహార్ లోని వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.