తమిళనాడులో స్కూల్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల ఓ విద్యార్థిని హాస్టల్ భవనం ముందు మృతి చెంది ఉండటం తీవ్ర కలకలం రేపగా.. ఆ తర్వాత మరో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా మరో బాలిక ఇంట్లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే విద్యార్థినులు బలవన్మరణానికి పాల్పడటం ఇది నాలుగో ఘటన. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa