పులివెందుల మార్కెట్ యార్డు కార్యాలయంలో ఛైర్మన్ గోటూరు చిన్నప్ప ఆధ్వర్యంలో భారత దేశపు మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త ఏ. పి. జె. అబ్దుల్ కలామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ అలవలపాటి ముకుందా రెడ్డి, చైర్మన్ పినుపోలు రాఘవేంద్రప్రసాద్ లతో కలిసి అబ్దుల్ కలాం చిత్ర పటానికి పూలమాలలు, వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప మాట్లాడుతూ అబ్దుల్ కలాం భారత అణు పితామహుడు, భారతరత్న, మానవతావాది అని పేర్కొన్నారు.
కలామ్ తన పుస్తకం ఇండియా 2020 లో 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అభివృద్ధి ప్రణాళికలు సూచించాడని తెలిపారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నాడని ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు రాష్ట్ర డైరెక్టర్ నూరుల్లా, ఎలక్ట్రానిక్స్ రఫీ, జయమ్మ కాలనీ ఫక్రుద్దీన్, కుళ్లాయప్ప, రఫీ, ఫారుక్, బిలాల్, మా భాష, నగిరిగుట్ట రఫీ, అజార్, భాష, విద్యార్థి విభాగం నాయకులు రామ లక్ష్మణ్ రెడ్డి మిత్ర బృందం, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ యార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.