అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కుయుగురు గ్రామంలో గోదావరి వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వరద నష్టం అంచనా మొదలుపెడుతున్నామని, రెండు నెలల్లో పరిహారం అందరికీ అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎవ్వరికీ ఎలాంటి నష్టం (పంట, ఇల్లు, పశువులు) జరిగినా ఆదుకునేందుకు ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ను ఎన్నిరోజులు అయ్యింది ఇంటికి వెళ్లి అని అడిగితే.. 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను సర్ అని చెప్పారు. ఈ నాలుగు మండలాల కోసం కలెక్టర్ ఇక్కడే తిష్టవేసి.. ప్రతి గ్రామం, మండలంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. కలెక్టర్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు ప్రజల తరఫున, నా తరఫున, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని తెలియజేసారు.