2026 వరకు అసెంబ్లీ స్థానాల పెంపు ఉండదని కేంద్రం ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి దీనిపై స్పందిస్తూ అసెంబ్లీ స్థానాలను పెంచితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు విభజన హామీలు ఇంతవరకూ అమలు కాకపోవడం దారుణమని పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులు కీలకమని తెలిపారు.