వెస్టిండీస్ గడ్డపై మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేయడంపై టీమిండియా తాత్కలిక సారథి శిఖర్ ధావన్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులోని ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. కుర్రాళ్లే అయినా పెద్దోళ్ల కంటే గొప్ప పరిణితితో ఆడారని మెచ్చుకున్నాడు. బుధవారం ఏకపక్షంగా సాగిన మూడో వన్డేలో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 119 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధావన్.. జట్టు ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా తన ప్రదర్శన కూడా సంతృప్తినిచ్చిందని తెలిపాడు. జట్టులోని ప్రతీ ఒక్కరూ సత్తా చాటారని తెలిపాడు. ఈ జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందన్నాడు.
'జట్టులోని ఆటగాళ్లందరూ కుర్రాళ్లే అయినప్పటికీ పరణితితో కలిసి ఆడారు. మైదానంలో వారి పనితీరు, సమన్వయం గర్వకారణం. ఇది జట్టుకు శుభసూచకం. నా వ్యక్తిగత ప్రదర్శన నాకు సంతృప్తినిచ్చింది. నేను చాలా కాలంగా వన్డే ఫార్మాట్‌లో ఆడుతున్నాను. అయితే ఈ సిరీస్‌లో మొదటి, మూడో మ్యాచ్‌ల్లో వారు ఆడిన తీరు చాలా ఆనందాన్నిచ్చింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో శుభమం గిల్ (98) పరుగులు చేయడం చాలా సంతోషంగా ఉంది.