వరదల వలన రాష్ట్ర ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భముగా రాజకీయనాయకులు, అలానే ధనవంతులు, కొన్ని స్వచ్చంధ సంస్థలు ఎవరికీ వారు పర్యటించి వారికి తోచిన సాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక సరి కొత్త ఆలోచనతో సంగం డైరీ వారు ముందుకు వచ్చారు. మనుషులతో పాటు పశువులు కూడా ఈ సమస్యని ఎదురుకుంటున్నాయి కాబట్టి వాటికి సాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండల పరిధిలోని వరద ముంపు గ్రామాలలో పశుగ్రాసం సమస్య అధికమించేందుకు మరియు పాడి రైతులకు అండగా ఉండేందుకు ఉచితంగా ఇరవై టన్నుల పశుదాణా పంపిణీ చేసిన డెయిరీ అధికారులు.