వర్షాలకు రోడ్లు పాడవడం కొత్త కాదు... కానీ ప్రజల ప్రాణాలు తీసేవరకు వాటిని బాగు చెయ్యక పోవడం మాత్రం క్షమించరాని నేరం అని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
అయన మాట్లాడుతూ... పశ్చిమ గోదావరి జిల్లా,పెంటపాడు మండలం, ముదునూరులో ప్రవీణ్ కుమార్ అనే యువకుడు బైక్ మీద వెళ్తూ, రావికుంట దగ్గర రోడ్డుపై ఉన్న గొయ్యి కారణంగా దుర్మణం చెందడం బాధాకరం. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసేందుకు వచ్చి, వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాడనగా...ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేసిందన్న వార్త మనసును కలచివేసింది.
ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయాలి. ప్రజల ప్రాణాలకు బాధ్యతగా నిలవాలి అని డిమాండ్ చేసారు.