ట్రెండింగ్
Epaper    English    தமிழ்

JCB ని దొంగతనం చేసిన దొంగలు అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 12:36 PM

ది. 23.072022 అర్ధరాత్రి సమయములో చేబ్రోలు మండలం, నారకోడురు సెంటర్ వద్ద పార్క్ చేసిన JCB bearing No. AP07 DV9662ని (విలువ సుమారు 25 లక్షల రూపాయలు) ఎవరో గుర్తు తెలియని దొంగలు దొంగిలించుకొని పోయారని, తగు చర్య నిమిత్తం ఫిర్యాది లగడపాటి సాంబశివరావు ఇచ్చిన రిపోర్ట్ పై చేబ్రోలు SI Y.సత్యనారాయణ గారు కేసు నమోదు చేశారు. 


గుంటూరు జిల్లా S.P..Arif Hafeez I.PS. గారి ఆదేశాల మేరకు, తెనాలి సబ్ డివిజన్ DSP శ్రీమతి స్రవంతి రాయ్  పర్యవేక్షణలో, పొన్నూరు రూరల్ CI ప్రభాకర్ గారు, చేబ్రోలు SI Y.సత్యనారాయణ గారు మరియు P.కోటేశ్వర రావు గార్లు సిబ్బందితో కలిసి రెండు ప్రత్యక బృందాలుగా ఏర్పడి, సాంకేతిక పరిజ్ఞానం సహాయముతో నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరి ఆడ్డ రోడ్ వద్ద రోడ్ కు పడమర మార్జిన్ వద్ద పొన్నూరు రూరల్ CI గారు, చేబ్రోలు ఎస్ఎY సత్యనారాయణ గారు తన సిబ్బందితో కలిసి JCB దొంగతనం చేసిన 1, కాకు మల్లికార్జున రావు S/o కొండయ్య,30 సl/0,యాదవ, రావూరు గ్రామం, గుడ్లూరు మండలం, నెల్లూరు జిల్లా మరియు 2. అట్లా నాగరాజు S/O రామమూర్తి (late), age/24 స//o , యాదవ,


రావూరు గ్రామం, గుడ్లూరు మండలం, నెల్లూరు జిల్లా, నిందితులను పట్టుకొని విచారించగా, నిందితులు ఇద్దరు ది. 23.072022 రాత్రి ఒక మోటార్ సైకల్ప చేబ్రోలు మండలం, నారకోడురు సెంటర్ వద్దకు చేరుకొని, రెక్కి చేసి, ఆర్థరాత్రి సమయములో వారి వద్ద ఉన్న తాళముతో JCBN start చేసి దొంగిలించుకొని పారిపోయాము అని చెప్పారు. అంతటా వారి వద్ద నుండి JCB bearing No. AP07 DV9662ని మరియు నేరములో ఉపయోగించిన Hero Glamour bike bearing No. AP39 DV8157 వాహనాలను స్వాదిన పరుచుకొని, ఆరెస్టు చేసి, చేబ్రోలు పోలీసు స్టేషన్ కి తీసుకొని వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com