జగన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకునేవాడికి అన్ని అనుమతులు ఉంటాయి. కానీ పేదలకు అన్నం పెట్టడం వంటి మంచి పనులు చేయాలంటే మాత్రం ప్రభుత్వం ఆంక్షల పేరిట వేధిస్తుంది అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. తాజాగా అన్నా కాంటీన్ పెట్టడానికి అనుమతి కోసం కోర్ట్ కి వెళ్లిన పరిస్థితి మీద స్పందిస్తూ.... నందిగామలో అన్న క్యాంటీన్ పెట్టినందుకు అధికారుల వేధింపులు ఎక్కువయ్యేసరికి నిర్వాహకులు హైకోర్టుకు వెళ్లారు. అన్నం పెడితే తప్పేముందన్న ఏపీ హైకోర్టు అన్న క్యాంటీన్ కు అనుమతి ఇవ్వాలని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదేశించింది అని తెలియజేసారు. హైకోర్టు తీర్పుపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.