పోలవరం విలీన మండలాల్లోని వరద పీడిత ప్రాంతాలలో పర్యటిస్తోన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ని కలిసేందుకు వరద బాధితులు భారీగా తరలివచ్చారు. కూడళ్లలో జనప్రవాహం వెల్లువెత్తింది. వేలేరుపాడు మండలంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన కొనసాగింది.
గురువారం ఈ కార్యక్రమం మొదలు పెట్టగ, ఈ రోజు కూడా పలు ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నట్లు తెలియజేసారు. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగుతుందని టీడీపీ నాయకులూ తెలియజేసారు.