ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన కోస్తా జిల్లాల రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో తక్షణ సాయం అందిస్తోంది అని వైసీపీ నాయకులూ తెలియజేసారు. ఇవేమీ విపక్ష తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడుకు కనపడడం లేదు. ఆయన పార్టీ నాయకులు తమ అధినేత దారిలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు గాని జరుగుతున్న వరద సాయం వారి కళ్లపడడం లేదు అని అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తులు చంద్రబాబు సీఎంగా ఉండగా ఎంత ఎక్కువ సంభవించాయంటే అసలు ఆయనే తెలుగు ప్రజలకు పెద్ద విపత్తు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పాలన, విభజిత ఏపీలో ఐదేళ్ల టీడీపీ నిర్వాకం చెప్పకనే చెబుతున్నాయి అని ఆరోపించారు.