అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు అనే నానుడి ఉందని, కానీ, అడగకపోయినా అక్కచెల్లెమ్మలకు అన్నీ ఇచ్చే మంచి మనసున్న సోదరుడు జగనన్న మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడని వైయస్ఆర్ సీపీ ఎంపీ వంగా గీత అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలకు అతీతంగా, అన్ని వయసుల వారికి ఏ సహాయం కావాలో తెలుసుకొని.. లంచం, సిఫారసు లేకుండా అందరికీ ఆర్థిక సహకారం అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని చెప్పారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వైయస్ఆర్ కాపు నేస్తం పథకం మూడో ఏడాది అమలు కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా పాల్గొని మాట్లాడారు.