మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి మహనీయులు పుట్టిన గడ్డపై ఈ విష వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరూ అని గుజరాత్ లోని బీజేపీ సర్కార్ ను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వీరిని కాపాడుతున్న రాజకీయ శక్తులు ఎవరని అడిగారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. ఇదిలావుంటే గుజరాత్ లోని బోటాడ్, అహ్మదాబాద్ జిల్లాల్లో ఈ నెల 25న కల్తీ మద్యం తాగి 42 మంది చనిపోయారు. మరో 97 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ లో అక్రమ మద్యం, డ్రగ్స్ మాఫియా దందాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మాఫియాలను అధికారంలో ఉన్న ఏ శక్తులు రక్షిస్తున్నాయని ప్రశ్నించారు. అక్రమ మద్యం వల్ల గుజరాత్ లో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. బిలియన్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa