చౌకదుకాణాల్లోను , రేషన్ పంపిణీలో అక్రమాలపై సోమవారం తిరుపతి జిల్లాలోని మండల ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట నిరసన తెలియజేసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తిరుపతి టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, చిత్తూరు టిడిపి పార్లమెంటు, చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తినాని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర , జిల్లా , నియోజకవర్గ , మండలాల్లోని ప్రధాన కమిటీ సభ్యులు పాల్గొనాలన్నారు.