చిత్తూరు జిల్లాలో 10 రోజులుగా ఉష్ణోగ్రతల్లో మార్పులు వచ్చాయి. చినుకు జాడ కనిపించకపోవడంతో ఎండలు మండిపోతున్నాయి. పది రోజులుగా 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. ఆదివారంతో ముగిసిన జూలై నెలలలో 103.5 మిమీ సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 77.9 మిమీ మాత్రమే కురిసింది.