ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు పునఃప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 01, 2022, 11:20 PM

గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు పునఃప్రారంభంకానున్నది. కరోనా సంక్షోభ సమయంలో రైల్వే శాఖ అనేక రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా పరిస్థితులు శాంతించడంతో క్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. తాజాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునఃప్రారంభిస్తోంది. ఆగస్టు 18 నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 


ఈ రైలు నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. ఇదిలావుంటే గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించడంపై ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com