జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరంలో 105 అడుగుల ఎత్తులో జెండా ప్రతిష్ట ట్రయల్ రన్ మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకేష్ బి. లాఠకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెండా ఏర్పాటుకు ఆర్థికసాయం అందించిన కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబును కలెక్టర్ అభినందించి దుశ్శాలువాతో సత్కరించి మెమెంటోను అందించారు. గతంలో కూడా సూరిబాబు అందించిన సేవలను కలెక్టర్కు గాంధీ మందిరం నిర్వాహకులు శాస్త్రి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సూరిబాబు సేవలను ప్రశంసించారు. భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి మరింతమందికి స్ఫూర్తిగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.