ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెరవాడవద్దనున్న వాగులో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 06:09 PM

భారీ వర్షాల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకొంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కల్లూరు మండలం నెరవాడ దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో స్థానికులు ఐదుగురు ఒకరినొకరు చేతులు పట్టుకుని వాగును దాటే ప్రయత్నం చేశారు. వాగు ఉధృతికి ఒక వ్యక్తి జారిపోయాడు. అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిని మద్దిలేటిగా గుర్తించారు. ఆయన మృతదేహం సమీపంలోని ముళ్ల పొదల్లో బయటపడింది. స్థానిక మార్కెట్ యార్డులో ఉన్న వాము మిల్లులో మద్దిలేటి పనిచేస్తున్నాడు.


మరోవైపు, హాలహర్వి మండలంలో నేత్రావతి నది పొంగిపొర్లుతుండంతో నెట్రవట్టి గ్రామంలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటు నంద్యాల జిల్లా పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నందికొట్కూరు జలమయమైంది. మారుతి నగర్, హాజీ నగర్, విలేకరి కాలనీ, సాయిబాబా కాలనీలు నీట మునిగాయి. పలు ద్విచక్రవాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మారుతీ నగర్ కాలనీలోనికి వరద నీరు రావడంతో రాత్రంతా ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మిద్దెల పైకి ఎక్కి కూర్చున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com