ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనుమతుడు ఇక్కడే పుట్టాడు: కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై

national |  Suryaa Desk  | Published : Tue, Aug 02, 2022, 06:17 PM

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లా కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండల్లోనే ఆంజనేయస్వామి పుట్టారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టంచేశారు. హనుమంతుడి జన్మస్థానంపై ఇప్పటికే పెద్ద వివాదం కొనసాగుతోంది. తిరుమల కొండల్లోని అంజనాద్రి హనుమంతుడు పుట్టిన స్థలమని టీటీడీ చెపుతోంది. తమ రాష్ట్రంలోని కిష్కింధ (ప్రస్తుత హంపి ప్రాంతం) ఆంజనేయుడి జన్మస్థలమని కర్ణాటక వాదిస్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న అంజనేరిలో హనుమంతుడు జన్మించాడని మరికొందరు అంటున్నారు.


ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై. హనుమంతుడు అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటూ చాలా మంది.. చాలా చెపుతున్నారని... కానీ కొప్పాల్ జిల్లా కిష్కింధ ప్రాంతంలోని అంజనాద్రి కొండల్లోనే ఆంజనేయస్వామి పుట్టారని... ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com