కొత్తిమీర అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఎముకల దృఢత్వం కోసం నిత్యం 30 గ్రాముల కొత్తిమీర తింటే మన శరీరానికి 547 శాతం విటమిన్ కె అందుతుందని.. అలాగే కొత్తిమీర తీసుకోవడం వల్ల మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి మినరల్స్ కూడా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొత్తిమీర ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు కొత్తిమీర రసం తాగితే ఫలితం ఉంటుంది.