ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో 16వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ‘స్వీట్ 16’ పేరుతో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అన్ని పన్నులతో కలిపి రూ.1616 ప్రారంభ ధరతో టికెట్‌ను ఇండిగో విడుదల చేసింది. ఈ ఆఫర్ శుక్రవారం వరకే ఉంటుంది. రేపటి లోగా టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది జులై 16 మధ్య ఎప్పుడైనా ఆ టికెట్ల ద్వారా ఇండిగోలో ప్రయాణం చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa