ఏపీలో లోన్ యాప్స్ ఆగడాలు మితిమీరుతున్నాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ బాధితుడు, లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక పోలీసుల చెంతకు చేరాడు. టీబీటీ కాలనీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుకునే శ్యామ్ కుమార్ కు అడగకపోయినా వెల్ క్రెడిట్ లోన్ యాప్ లోన్ ఇచ్చింది. వడ్డీలేస్తూ డబుల్ అమౌంట్ వసూలు చేయడంతో శ్యామ్ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. వరుసగా మూడోసారి డబ్బులేసి వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశాడు.