పెద్దతిప్ప సముద్రం మండలంలోని సంపతి కోట పంచాయతీ కానుగమాకులపల్లి క్రాస్ వద్ద పోలీసులు నాకాబందీ నిర్వహించారు. కర్నాటక రాష్ట్రం వైపు వెళుతున్న సత్య సాయి జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ కు చెందిన ఓ వ్యక్తికి చెందిన ద్విచక్ర వాహనం తనిఖీ చేశారు. ఒకటిన్నర కిలోల గంజాయి పట్టుకున్నట్లు ఎస్సై మధురామచంద్రుడు తెలిపారు. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనంతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa