తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మి పార్వతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ మరణానికి కారకుడు అయిన హంతకుడు చంద్రబాబును నందమూరి కుటుంబం నమ్మిందన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చూస్తే జాలేస్తుంది.
ఎన్టీఆర్ మరణం తరువాత జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే.. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారకుడు.. ఆ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా చనిపోకముందు ఆడియో, వీడియోల రూపంలో చెప్పారు. చంద్రబాబు ఎంత దుర్మార్గుడో.. ఎటువంటి వెన్నుపోటు తనకు జరిగిందో ఎన్టీఆర్ వివరించారు అని తెలియజేసారు.