నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ప్రజల మన్నలను పొందుతున్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంట లే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది.
ఓ పెళ్లకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అయిపోతుండటంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసి మధ్యలో ఇరుక్కు పోయారు.
జనం చోద్యం చూస్తూ ఉండిపోయారు. స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు.