దేశంలో ఉల్లి ధర దారుణంగా పడిపోయింది. దేశీయ మార్కెట్లో ఉల్లి ధర తగ్గుముఖం పట్టడంతో ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో ధరలు సుమారు 19 శాతం తగ్గాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నాయి. మహారాష్ట్రలోని లాసల్‌గావ్ మండిలో కిలో ధర రూ.11కి పడిపోగా ఉల్లి రైతుల సంఘం ప్రభుత్వాలను కిలోకు రూ.25లు ఇవ్వాలని కోరింది. ధర రాకపోతే ఆగస్టు 16 నుంచి ఉల్లి సరఫరాను నిలిపివేయనున్నట్లు రైతులు హెచ్చరించారు.