మంకీపాక్స్ పై కేంద్రం ఆరోగ్య శాఖ పలు సూచనలు చేసింది. మంకీపాక్స్ సోకిన వారితో వస్త్రాలు, టవళ్లు, బెడ్ షీట్లు వంటివి పంచుకోకూడదు. ఇన్ఫెక్షన్ సోకినవారి దుస్తులతో ఇతరుల వస్త్రాలను కలిపి ఉతకకూడదు. మంకీపాక్స్ కు సంబంధించిన లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఎలాంటి బహిరంగ ప్రదేశాలు, జనం గుమిగూడే ప్రదేశాలకు తీసుకెళ్లకూడదు. వైరస్, లక్షణాల గురించి తప్పుడు సమాచారాన్ని ఎవరితో కూడా పంచుకోకూడదని ఆరోగ్య శాఖ తెలిపింది.