ఓ టీచర్ కు 79 ఏళ్ల జైలు శిక్ష పడింది. కేరళలోని తాలిపరంబ ఫాస్ట్ ట్రాక్ పోస్కో కోర్టు ఈ తీర్పును వెలువడించింది. నిందితుడు పీఈ గోవిందన్ నంబూద్రి (50) కన్నూరులోని 4, 5వ తరగతులకు చెందిన నలుగురు విద్యార్థినులపై లైంగిక దాడులు చేసినట్లు కేసు నమోదైంది. 2013 నుంచి 2014 వరకూ ఆయన పలు దారుణాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో కోర్టు ఆయనకు 79 ఏళ్ల శిక్ష విధించింది.