నిరుపేదల సంక్షేమమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని బి. కొత్తకోట మండలం, గుడిపల్లె, బీరంగి పంచాయతీల సర్పంచులు గిరిజ రఘునాథ్ రెడ్డి, వెంకటరమణలు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా పంచాయతీలకు మంజూరైన నూతన పెన్షన్లను గురువారం వారు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.