ఎన్టీఆర్ కమార్తె ఉమామహేశ్వరి మృతిని సామాజిక మాధ్యమం వేదికగా శవరాజకీయాలు చేయడం సిగ్గుచేటని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సుధాఅంకిరెడ్డి, నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం కమలాపురం పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి మృతిని వైసీపీ పెద్దలు గుండెపోటుతో మరణించారని సొంత పత్రిక, టీవీలో ప్రసారం చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యబద్దంగా ప్రజల పక్షాన పోరాడే కుటుంబాల పరువు తీసే విధంగా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలుగు యువత మండల అధ్యక్షుడు ఎర్రబల్లె చిన్న సుబ్బారెడ్డి, కాపు నాయకుడు మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.