ప్రజా పంపిణీ, ఆహార భద్రతా పథకాల కింద రాష్ట్రానికి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు అసలు పొంతన లేదు అని ఎంపీ మార్గాని భరత్ తెలియజేసారు.
ఈ సందర్భంగా మీడియా తో అయన మాట్లాడుతూ... పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారు. వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తాం. వాస్తవాలకు విరుద్ధంగా, "కేంద్రం నుంచి తీసుకునే రేషన్ ఎక్కువ.. ప్రజలకు పంచేది తక్కువ" అంటూ ఈనాడు, ఇతర పత్రికల్లో ఆ కథనాలను ప్రచురించి, రాష్ట్రంలోని పేద ప్రజల్లో గందరగోళ పరిస్థితిని సృష్టించారు.
ఇది పూర్తిగా ప్రజలను తప్పుదారి పట్టించడమే. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ పడిందా? లేక మరొకటా అనే దానిపై కేంద్ర మంత్రిని కలిసి స్పష్టత కోరతాం. ఇటువంటి వార్తలు ప్రజలలోకి వెళితే ఏవిధమైన తప్పుడు సంకేతాలు వెళతాయనేది గమనించాలి.