క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పథకాన్ని అమలు చేస్తున్న తీరును ఉపముఖ్యమంత్రి అంజా ద్ భాష కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, కార్పొ రేటర్లు గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించారు. కడప నగరపాలక సంస్థ అధికారులు చెత్తపన్ను వసూళ్లను నిలిపేయాలని ఆదేశించారు.
పాలకవర్గం నుంచి కమిటీని ఏర్పాటు చేసి క్లాప్ పథకాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించాలని తీర్మానించారు. ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధుల బృందం క్లాప్ పథకంపై రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల తదనంతరం కడపలో చెత్తపన్ను ఎంత వసూలు చేయాలి, ఎప్పటి నుంచి వసూలు చేయాలన్న అంశాలను స్పష్టీకరిస్తారన్నారు.