మనం సంపూర్ణ ఆరోగ్యంగా బ్రతకాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరని వైద్యులు చెబుతున్నారు. రోజులో ఎనిమిది గంటలు నిద్రపోవడం, రోజులో దాదాపు 10,000 అడుగులు నడవడం, తగినన్ని నీళ్ళు తాగడం వంటి అలవాట్లతో ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు. ధ్యానం, యోగా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. బరువు అదుపులో ఉంటుంది. సంగీతం వినడం, గార్డెనింగ్ ఇలా నచ్చిన పని కోసం రెండు గంటలు కేటాయించాలి. పండ్లు, కూరగాయలను తప్పనిసరిగా తినాలి.