పేరున్న తారాలను వాడుసుకోవడం వ్యాపారులకు అలవాటే. కానీ ఓ హెయిర్ సెల్ యాజమాని సైతం ఓ లెజండరీని వాడేసుకోవడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తోంది. భారతదేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్. దశాబ్దాలుగా తన నటనా ప్రతిభతో జాతీయస్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన చిత్రాలు అంతర్జాతీయంగానూ ఖ్యాతి పొందాయి. హాలీవుడ్ చిత్రం 'గ్రేట్ గాట్స్ బీ'లోనూ అమితాబ్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయనకు పలుదేశాల్లో అభిమాన గణం ఉంది. ఇదిలావుంటే ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఓ సెలూన్లో అమితాబ్ బచ్చన్ ఫొటోతో ప్రచారం చేసుకుంటుండడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను అమితాబ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. పారిస్ లోని ఓ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్లో తన ఫొటోను ప్రదర్శిస్తుండగా, ఓ వ్యక్తి కంటబడిందని వెల్లడించారు. దేవుడా... ఇదెక్కడి విడ్డూరం... భలేగుందే! అంటూ ఆయన విస్మయం వ్యక్తం చేశారు.