కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. 8వ రోజు ముగిసే సమయానికి భారత్ 9 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో 26 పతకాలు సాధించి ఐదో స్థానంలో కొనసాగుతోంది. మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్‌లో భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి రజతం సాధించింది. పురుషుల 300 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఫైనల్‌లో అవినాష్ సాబ్లే రజతం సాధించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa