బైక్ ను లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గొట్లాం గ్రామం వద్ద చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న లారీ అంబటివలస గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సిరిపురపు తవుడును గొట్లాం గ్రామ సమీపంలో ఢీకొట్టడంతో కిందపడిపోయారు. తవుడు తల మీద నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే బొండపల్లి ఎస్. ఐ రవి సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు.